Mission chandrayaan -3

India’s Chandrayaan-3 landing on moon :

భారతదేశం యొక్క చంద్రయాన్-3 చంద్రునిపై ల్యాండింగ్ :

In a few hours :

A new story in 2019, ISRO's Chandrayaan 2 launch crashed during soft landing. In the same year, Israel failed to land the Bershit lander on the moon And in 2023, the mission undertaken by the Japanese private space company I Space failed at the last minute. Recently, the Russian Luna 25 also crashed. Now, if Chandrayaan 3 is successful, India will become the 4th country after Soviet, USA and China to achieve this feat.

కొద్ది గంటల్లో :

కొత్త  చరిత్ర 2019లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. ఇదే ఏడాది ఇజ్రాయిల్ బెర్షిత్ ల్యాండర్ను చంద్రుడిపై దింపే టైంలో విఫలమైంది. ఇక 2023లో జపాన్ కు చెందిన ప్రైవేట్ స్పేస్ సంస్థ ఐ స్పేస్ చేపట్టిన మిషన్ చివరి నిమిషంలో ఫెయిల్ అయింది. తాజాగా రష్యా లూనా25 సైతం కూలిపోయింది. ఇప్పుడు చంద్రయాన్ 3 సక్సెస్ అయితే సోవియట్, అమెరికా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన 4వ దేశం భారత్ అవుతుంది.

Chandrayaan-3 launch because?

With the launch of Chandrayaan-3 at a cost of 615 crores, the secrets of the birth of the moon are likely to be known. As part of this, along with the rover that will land on the surface of the moon, the lander will also have to perform many experiments and achieve the goals set by ISRO. Exploration of lunar surface, atmosphere, availability of water, observation of minerals, availability of elements are important in this. They also take photos and 3D mapping of the lunar surface.

చంద్రయాన్-3 ప్రయోగం ఎందుకంటే? 

615 కోట్లతో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుని పుట్టుకకు సంబంధించిన రహస్యాలు తెలిసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా చంద్రుని ఉపరితలంపై దిగే రోవర్తో పాటు ల్యాండర్ కూడా చాలా ప్రయోగాలు చేసి ఇస్రో నిర్దేశించిన లక్ష్యాలు సాధించాల్సి ఉంటుంది. చంద్రుని ఉపరితల శోధన, వాతావరణం, నీటి లభ్యత, ఖనిజాల పరిశీలన, మూలకాల లభ్యత శోధన ఇందులో ముఖ్య మైనవి. ఇవి చంద్రుడి ఉపరితలాన్ని ఫోటోలు తీసి 3D మ్యాపింగ్ కూడా చేస్తాయి.

Chandrayaan-3 Mission.. When and what happened?

 **July 14 - Chandrayaan-3 launched from Sriharikota to travel Scientists who raised the orbit step by step

**August 1- Lunar Orbital Journey

**August 5- Entry into lunar orbit

**August 6, 9, 14, 16- Orbit reduction maneuvers

**August 17- Lander separated from propulsion module

**August 18- First process of speed reduction

**August 20- Second process of speed reduction

చంద్రయాన్-3 మిషన్.. ఎప్పుడు ఏం జరిగింది? 

జూలై 14 - శ్రీహరికోట నుంచి మొదలైన చంద్రయాన్-3 ప్రయాణం దశల వారీగా కక్ష్యను పెంచిన సైంటిస్టులు

ఆగస్టు 1- చంద్రుని కక్ష్య వైపు పయనం

ఆగస్టు 5- చంద్రుని కక్ష్యలోకి ప్రవేశం

ఆగస్టు 6, 9, 14, 16- కక్ష్య తగ్గింపు విన్యాసాలు 

ఆగస్టు 17- ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన ల్యాండర్

ఆగస్టు 18- వేగం తగ్గింపు తొలి ప్రక్రియ

ఆగస్టు 20- వేగం తగ్గింపు రెండో ప్రక్రియ

Information about the moon will reach like this.. :

After the lander of the Chandrayaan 3 mission lands on the regolith of the moon's surface, the rover will emerge from it. It orbits the Moon and analyzes the surface. That information is sent to the nearest lander. The lander will transmit the information it collects to the Chandrayaan-2 orbiter flying above at a distance of 100 km. From there the information reaches the ISRO base station.

చంద్రుని సమాచారం చేరుతుంది ఇలా.. :

చంద్రయాన్ 3 మిషన్లోని ల్యాండర్ చంద్రుడి ఉపరితలం రెగోలిత్ మీద దిగిన తర్వాత దాని నుంచి రోవర్ బయటకొస్తుంది. ఇది చంద్రుడి మీద తిరుగుతూ ఉపరితలాన్ని విశ్లేషిస్తుంది. ఆ సమాచారం దగ్గరలోని ల్యాండర్ కు పంపుతుంది. ల్యాండర్ తాను సేకరించిన సమాచారాన్ని 100కి.మీ దూరంలో పైన ఎగురుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్కు పంపుతుంది. అక్కడి నుంచి ఇస్రో బేస్ స్టేషను ఇన్ఫర్మేషన్ చేరుతుంది.

Spacecraft Landing Rough Braking in 4 Stages:

Speed of 6048 kmph is reduced by 4 throttle bull engines.

Attitude Hold: The ship changes attitude by 50 degrees and analyzes the distance.

Fine braking: zero speed. Observation of the landing site from a height of 800 meters

Terminal Descent: 150, the lander reaches an altitude of 60 meters and probes the surface. If there are stones, it will go to an alternate place and land.

4 దశల్లో వ్యోమనౌక ల్యాండింగ్ రఫ్ బ్రేకింగ్: 

గంటకు 6048కి.మీలు ఉన్న వేగాన్ని 4 థ్రోటల్ బుల్ ఇంజిన్లతో తగ్గిస్తారు.

ఆటిట్యూడ్ హోల్డ్: నౌక దృక్కోణాన్ని 50డిగ్రీలకు మార్చుకుని గమదూరాన్ని విశ్లేషిస్తుంది.

ఫైన్ బ్రేకింగ్: వేగం సున్నా. 800మీటర్ల ఎత్తులో నుంచి ల్యాండింగ్ ప్రదేశం పరిశీలన

టెర్మినల్ డిసెంట్: 150, 60 మీటర్ల ఎత్తుకు చేరి ఉపరితలాన్ని పరిశీలిస్తుంది ల్యాండర్. రాళ్లు ఉంటే ప్రత్యామ్నాయ ప్రదేశానికి వెళ్లి ల్యాండ్ అవుతుంది.

Features of Chandrayaan 3 Lander and Rover:

The lander can communicate with the previous Chandrayaan 2 orbiter and directly with the base station on Earth. The rover is only connected to the lander

There are places at the South Pole that are permanently dark. The Vikram lander will land on a sunny spot. Solar power is the basis for the lander and rover to work. > After 4 hours of landing Pragyan rover will come out. moves at a speed of cm/sec.

చంద్రయాన్ 3 ల్యాండర్, రోవర్ విశేషాలు..:

> గత చంద్రయాన్ 2 ఆర్బిటర్తోనూ, నేరుగా భూమి మీద బేస్ స్టేషన్తోనూ ల్యాండర్ కమ్యూనికేషన్ సాగించగలదు. రోవర్ మాత్రం కేవలం ల్యాండర్తోనే అనుసంధానమై ఉంటుంది

సౌత్ పోల్లో శాశ్వతంగా చీకట్లో ఉండే ప్రదేశాలున్నాయి. విక్రమ్ ల్యాండర్ సూర్యరశ్మి ఉండే ప్రదేశంలోనే దిగుతుంది. ల్యాండర్,రోవర్ పని చేయాలంటే సోలార్ పవరే ఆధారం. > ల్యాండ్ అయిన 4గంటల తర్వాత ప్రగ్యాన్ రోవర్ బయటకొస్తుంది. cm/sec వేగంతో కదులుతుంది.

'Libs'.. :

An important instrument in the rover An important instrument in the lunar rover is the Laser Induced Breakdown Spectrometer. This is called libs. After the rover lands on the surface of the moon, the laser beams fitted to this device shine on the surface, causing the soil to burn at high temperatures. The gases released through this are spectro-analysed. This will analyze the elements on the surface of the moon.

'లిబ్స్'.. :

రోవర్లో ముఖ్యమైన పరికరం చంద్రునిపై కలియతిరిగే రోవర్లో ఉండే ముఖ్యమైన పరికరం లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రో మీటర్. దీన్నే లిబ్స్ అంటారు. రోవర్ చంద్రుని ఉపరితలంపై దిగిన తర్వాత ఈ పరికరానికి అమర్చిన లేజర్ బీమ్స్ ఉపరితలంపై ప్రసరించి.. నేల అత్యధిక ఉష్ణోగ్రత వద్ద మండేలా చేస్తుంది. దీని ద్వారా వెలువడిన వాయువుల్ని స్పెక్ట్రో ఎనాలిసిస్ చేస్తారు. దీంతో చంద్రుడి ఉపరితలంపై ఉన్న మూలకాలను విశ్లేషిస్తారు. 

Why was the spacecraft covered in gold?

Gold film visible on Chandrayaan-3 spacecrafts, satellites. Nehru Planetarium Director Arvind said that this golden film will be made of polyester. The film is said to provide protection up to temperatures of -300°C. It also protects the sensors from being damaged by space dust. It is said that this will cover the parts that are likely to be damaged due to radiation.

వ్యోమనౌకను బంగారు రంగుతో ఎందుకు కవర్ చేశారు?

చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్స్, శాటిలైట్లపై బంగారు ఫిల్మ్ కనిపిస్తుంది. ఈ బంగారు రంగు ఫిల్మ్ ను పాలిస్టర్తో  తయారుచేస్తారని నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్ అరవింద్ తెలిపారు. -300°C ఉష్ణోగ్రత వరకు తట్టుకునేలా ఈ ఫిల్మ్ రక్షణ కల్పిస్తుందని వివరించారు. అలాగే అంతరిక్ష ధూళి కారణంగా సెన్సార్లు దెబ్బతినకుండా రక్షిస్తుందన్నారు. రేడియేషన్కు గురై పాడయ్యే అవకాశం ఉన్న భాగాలనే దీంతో కవర్ చేస్తారని చెప్పారు.

Chandrayaan-3.. Another Braking news:

While the Vikram lander of Chandrayaan-3 is ready to land on the moon.. ISRO has given another good news. It is said that more than 150 kg of fuel is left in the propulsion module that brought the lander. Scientists who thought it would work only for 6 months, now think it can work for many years. The Propulsion Module orbits and studies the Earth's atmosphere.

చంద్రయాన్-3.. మరో సూపర్ న్యూస్:

చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధంగా ఉండగా.. ఇస్రో మరో శుభవార్త చెప్పింది. ల్యాండర్ను తీసుకొచ్చిన ప్రొపల్షన్ మాడ్యూల్లో 150 కేజీల కంటే ఎక్కువ ఇంధనం మిగిలి ఉందని తెలిపింది. ఇదివరకు 6 నెలలు మాత్రమే పని చేస్తుందనుకున్న సైంటిస్టులు.. ఇప్పుడు చాలా సంవత్సరాలు పనిచేయవచ్చని భావిస్తున్నారు. ప్రొపల్షన్ మాడ్యూల్ కక్ష్యలో తిరుగుతూ భూ వాతావరణంపై అధ్యయనం చేస్తుంది.

ISRO's specialty is to make a Experiments at the lowest cost :

ISRO's specialty ISRO's space experiments are less than the budget of some Hollywood movies. ISRO has been carrying out missions efficiently and effectively at a very low cost. Chandrayaan-2, the famous space missions undertaken by ISRO, cost Rs.978 crores, Mangalya Rs.450 crores and Chandrayaan-3 Rs.615 crores. No other country has taken up space travel so cheaply.

అతి తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేయడం ఇస్రో ప్రత్యేకత: 

ఇస్రో చేపట్టే అంతరిక్ష ప్రయోగాలు కొన్ని హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కంటే తక్కువగానే ఉంటాయి. అతి తక్కువ ఖర్చుతో మిషన్లను చేపట్టి సమర్థవంతంగా ఇస్రో నిర్వహిస్తూ వస్తోంది. ఇస్రో చేపట్టిన ప్రముఖ అంతరిక్ష యాత్రలైన చంద్రయాన్-2కి రూ.978కోట్లు, మంగళయానికి రూ.450కోట్లు, చంద్రయాన్-3కి రూ.615కోట్లు ఖర్చయ్యాయి. ఇంత చౌకగా ఏ దేశమూ అంతరిక్ష యాత్రలు చేపట్టలేదు.

Manned Chandrayaan Mission:

ISRO launched Chandrayaan Mission with the aim of exploring the possibility of human life on the Moon. The information sent by Chandrayaan 3 will be crucial for the next experiments. According to this information, Chandrayaan 4, 5, 6 etc. will be carried out by ISRO. ISRO's target is to send astronauts to the moon by Chandrayaan 10 or 11 with the information coming from a series of experiments.

మానవ సహిత చంద్రయాన్ ప్రయోగమే లక్ష్యం:

చంద్రుడిపై మనిషి జీవించడానికి గల అవకాశాల్ని అన్వేషించడమే లక్ష్యంగా ఇస్రో చంద్రయాన్ మిషన్ ప్రారంభించింది. చంద్రయాన్ 3 పంపించే సమాచారం తర్వాతి ప్రయోగాలకు అత్యంత కీలకం కానుంది. ఈ సమాచారం ప్రకారం చంద్రయాన్ 4,5,6 ఇలా.. ఇస్రో ప్రయోగాల్ని చేపట్టనుంది. వరుస ప్రయోగాలు ద్వారా వచ్చే సమాచారంతో చంద్రయాన్ 10 లేదా 11 కల్లా చంద్రుని మీదకు వ్యోమగాముల్ని పంపాలనేది ఇస్రో టార్గెట్.


Comments

Popular posts from this blog

Professional engineering

"Samudrayaan"