Father of Green revolution in India

Green revolution in India by 'M S. Swaminathan'

'M S. స్వామినాథన్' ద్వారా భారతదేశంలో హరిత విప్లవం .

              Some inventions made India feel good in the space sector.. some other inventions led the country from food crisis to prosperity. 'M S. Swaminathan, who brought revolutionary changes in the country's agriculture sector, is known as the 'Father of Green Revolution' of India. Swaminathan, who raised the country's reputation in the field of agriculture with his research, passed away at the age of 98 at his home in Chennai on Thursday morning due to old age problems.

               కొన్ని ఆవిష్కరణలు భారతన్ను అంతరిక్షరంగంలో భళా అనిపించేలా చేస్తే.. మరికొన్ని ఆవిష్కరణలు దేశాన్ని ఆహార సంక్షోభం నుంచి సమృద్ధి దిశగా నడిపించాయి. ఒకప్పుడు ఆహార ధాన్యాల కోసం ఇతర దేశాలపై ఆధారపడ్డ దేశాన్ని నేడు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేర్చిన మహోన్నత వ్యక్తి 'M. S. స్వామినాథన్, దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి.. భారతదేశ 'హరిత విప్లవ పితామహుడి'గా పేరుగాంచారు. తన పరిశోధనలతో వ్యవసాయరంగంలో దేశ కీర్తిప్రతిష్ఠలను పెంచిన స్వామినాథన్.. 98 ఏళ్ల వయస్సులో వృద్ధాప్య సమస్యలతో గురువారం ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు.

                    That drought changed Swaminathan's mind Swaminathan was born on August 7, 1925 in Kumbakonam, Madras Presidency. His father was Sambashivan. He is a surgeon. Swaminathan also wanted to become a doctor like his father. But, after seeing the famine in Bengal in 1943, he changed his mind and started towards agricultural research. Graduated in Zoology from Maharaja's College, Trivendra, followed by Bachelor's Degree in Agricultural Science from Madras Agricultural College and PG from Indian Agricultural Research Institute (IARI), Delhi. He completed his PhD in Cambridge University School of Agriculture. Returned to India in 1954 and continued research as a scientist at IARI.

                     ఆ కరవు స్వామినాథన్ మనసు మార్చేసింది స్వామినాథన్ 1925 ఆగస్టు 7న మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి సాంబశివన్. ఆయన ఒక సర్జన్. స్వామినాథన్ కూడా తండ్రిలాగే డాక్టర్ కావాలనుకున్నారు. కానీ, 1943లో బెంగాల్లో సంభవించిన కరవును చూశాక.. తన మనసు మార్చుకుని వ్యవసాయ పరిశోధనల వైపు అడుగువేశారు. త్రివేంద్రంలోని మహారాజా కాలేజీలో జువాలజీ డిగ్రీ పట్టా పొంది.. తర్వాత మద్రాసు అగ్రికల్చరల్ కళాశాలలో అగ్రికల్చరల్ సైన్స్ బ్యాచిలర్ డిగ్రీ, ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (IARI)లో పీజీ చదివారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ లో పీహెచ్డీ పూర్తిచేశారు. 1954లో భారత్కు తిరిగొచ్చి IARIలో శాస్త్రవేత్తగా రీసెర్చ్ కొనసాగించారు.

                   The Green Revolution started in the 1960s worldwide. Swaminathan conducted research with many scientists including Norman Borlaug, who is known as the father of the global green revolution. In India, extensive research was done on drought prevention, development of new high-yielding crops, use of mechanized tools in agriculture, irrigation systems, herbicides and fertilizers. Swaminathan's work in 1960s to 1970s was for Indian agriculture.

                     ప్రపంచవ్యాప్తంగా 1960 దశకంలో హరిత విప్లవం ప్రారంభమైంది. ప్రపంచ హరిత విప్లవ పితామహుడిగా పేరు గాంచిన నార్మన్ బోర్లాగ్ సహా పలువురు శాస్త్రవేత్తలతో స్వామినాథన్ పరిశోధనలు చేశారు. భారత్లో కరవు నివారణ, అధిక దిగుబడిని ఇచ్చే నూతన వంగడాల అభివృద్ధి, వ్యవసాయంలో యాంత్రిక ఉపకరణాల వినియోగం, నీటిపారుదల వ్యవస్థలు, కలుపు సంహారకాలు, ఎరువుల గురించి విస్తృతంగా పరిశోధనలు జరిపారు. 1960 నుంచి 1970ల్లో స్వామినాథన్ చేసిన కృషి భారత వ్యవసాయ.

                       It has brought revolutionary changes in the field. Drought-stricken Indian agriculture sector has been taken from crisis to self-sufficiency. The country's agricultural productivity has increased tremendously due to high-yielding wheat and rice crops. India, which used to import food grains from other countries till then, has grown to the level of exporting to other countries. In 2006, the Swaminathan-led commission issued a report making several recommendations for the minimum support price for farmers. Still the report given by this committee is taken as standard in the agricultural sector.

                      రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కరవు కోరల్లో చిక్కుకున్న భారత వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి స్వయం సమృద్ధివైపునకు తీసుకెళ్లింది. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాల వల్ల దేశ వ్యవసాయ ఉత్పాదకత అమాంతం పెరిగింది. అప్పటివరకూ ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే భారత్.. ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. రైతులకు కనీస మద్దతు ధర కోసం 2006లో స్వామినాథన్ నేతృత్వంలోని కమిషన్ పలు సిఫార్సులు చేస్తూ ఓ నివేదిక విడుదల చేసింది. ఇప్పటికీ వ్యవసాయ రంగంలో ఈ కమిటీ ఇచ్చిన నివేదికనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు.

Swaminathan-Victory :

                     Swaminathan played a key role in designing superior varieties of rice, wheat and maize to combat food shortages in the country.

Swaminathan was instrumental in developing the world's first high yielding basmati rice.

Swaminathan focused on advanced agricultural equipment along with the creation of new crops that increase yield. This marked the beginning of mechanization in domestic agriculture.

Awards received by Swaminathan :

1) Padma Shri (1967)

2) Ramon Magsaysay (1971)

3) Padma Bhushan (1972)

4) Albert Einstein World Award of Science (1986)

5) World Food Prize (1987)

6) Padmavibhushan (1989)

7) Indira Gandhi Peace Prize (1999)

8) Indira Gandhi National Unity Award (2013)

స్వామినాథన్-విజయాలు :

                          దేశంలో ఆహార కొరతను ఎదుర్కోవడానికి మేలైన వరి, గోధుమలు, మొక్కజొన్న వంగడాల రూపకల్పనలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు

ప్రపంచంలోనే మొట్టమొదటి అధిక దిగుబడినిచ్చే బాస్మతి బియ్యాన్ని అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ సహకారం ఉంది.

దిగుబడిని పెంచే నూతన వంగడాల సృష్టితో పాటు అధునాతన వ్యవసాయ పరికరాలపై స్వామినాథన్ దృష్టి సారించారు. ఇది దేశీయ వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు నాంది పలికింది.

స్వామినాథన్ అందుకున్న పురస్కారాలు :

1)పద్మశ్రీ (1967)

2)రామన్ మెగసెసే (1971)

3) పద్మభూషణ్ (1972)

4)ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ అవార్డ్ ఆఫ్ సైన్స్ (1986)

5)వరల్డ్ ఫుడ్ ప్రైజ్ (1987) 

6)పద్మవిభూషణ్ (1989)

7)ఇందిరా గాంధీ శాంతి బహుమతి( 1999)

8)ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతాపురస్కారం (2013)

Although Swaminathan grew up in an era where medicine and engineering were considered highly respected, he took steps towards agriculture. New arrivals. He made innovations and increased yields and changed the Indian agricultural system. He made the country self-sufficient in agriculture. This effort made MS Swaminathan the "Father of India's Green Revolution". This farmer's brother has no death.. The nation will never forget his services.

మెడిసిన్, ఇంజినీరింగ్ చాలా గౌరవప్రదంగా భావించే కాలంలో స్వామినాథన్ పెరిగినప్పటికీ వ్యవసాయం వైపే ఆయన అడుగులు వేశారు. నూతన వంగడాలు. ఆవిష్కరణలు చేసి దిగుబడులను పెంచి భారత వ్యవసాయ వ్యవస్థను మార్చారు. వ్యవసాయంలో దేశం స్వయం సమృద్ధి సాధించేలా చేశారు. ఈ కృషే MS స్వామినాథన్ ను "భారత హరిత విప్లవ పితామహుడు"గా నిలిపింది. ఈ రైతు బాంధవుడికి మరణం లేదు.. ఆయన సేవలను దేశం ఏనాటికీ మరచిపోదు.

Comments

Popular posts from this blog

Professional engineering

"Samudrayaan"