SOME IMPORTANT INFORMATION ABOUT CHANDRAYAAN -3

These are the things that will contribute to the safe landing of Chandrayaan-3

Altimeters- control the height of the lander Velocimeters- control the speed

Inertial measurement-calculates inertia Propulsion system controls speed based on altitude Navigation, guidance & control-determines landing path

Hazardous Detection & Avoidance- Hazard

recognizes

Landing Leg Mechanism- Landing at constant speed.


చంద్రయాన్ -3 సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు సహకరించేవి ఇవే

అల్టీమీటర్స్- ల్యాండర్ ఎత్తును నియంత్రిస్తాయి వెలోసీమీటర్స్- వేగాన్ని నియంత్రిస్తాయి

ఇనర్షియల్ మెజర్మెంట్-ఇనర్షియాను లెక్కిస్తుంది ప్రొపల్షన్ సిస్టమ్ ఎత్తును బట్టి వేగాన్ని నియంత్రిస్తుంది నేవిగేషన్, గైడెన్స్ & కంట్రోల్-ల్యాండింగ్ మార్గాన్ని నిర్దేశిస్తుంది

హజార్డియస్ డిటెక్షన్ &అవాయిడెన్స్- ప్రమాదాన్ని

గుర్తిస్తుంది.

ల్యాండింగ్ లెగ్ మెకానిజం- స్థిరమైన వేగంతో ల్యాండింగ్ చేస్తుంది.

Chandrayaan-3: What will happen after landing?

When Chandrayaan-3's lander Vikram makes a soft landing on the lunar surface, the 'touch down sensors' send messages to the on-board computer. After 4 hours of landing, the lander ramp will emerge. A 6-wheeled Pragyan rover slowly descends from it. It moves at a speed of centimeter per second. Vikram lander and Pragyan rover will remain on the lunar surface for 14 days and conduct research.

చంద్రయాన్-3: ల్యాండింగ్ అయ్యాక ఏం జరుగుతుందంటే?

చంద్రయాన్-3లోని ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండ్ కాగానే 'టచ్ డౌన్ సెన్సార్లు' ఆన్ బోర్డు కంప్యూటర్కు సందేశాలు పంపుతాయి. ల్యాండింగ్ పూర్తయిన 4 గంటల తర్వాత ల్యాండర్ ర్యాంప్ బయటకొస్తుంది. అందులో నుంచి 6 చక్రాల ప్రగ్యాన్ రోవర్ నెమ్మదిగా దిగుతుంది. సెకనుకు సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపైనే ఉండి పరిశోధనలు చేస్తాయి.

Royal seal on the moon:

After the safe landing of Vikram lander on the moon, Pragyan rover will come out from the lander. However, the ISRO logo along with the royal seal consisting of four lions is placed on the wheels mounted on the rover. As the rover orbits the moon, the impressions on the tires will fall on the surface.


చంద్రుడిపై రాజ ముద్ర :

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ అయ్యాక చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ దిగగానే.. అందులో నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు రానుంది. అయితే, రోవర్కు అమర్చిన చక్రాలపై నాలుగు సింహాలతో కూడిన రాజముద్రతో పాటు ఇస్రో లోగోను ఉంచారు. రోవర్ చంద్రుడిపై తిరుగుతున్నప్పుడు టైర్లపై ఉన్న ముద్రలు ఉపరితలంపై పడనున్నాయి.

Details of lander and rover

* The name of the lander that went in Chandrayaan-3 was Vikram. Its weight is 1749.8 kg. Lifetime.. 14 days. 2 Two meters long, 2 m. This wide lander is equipped with three payloads.

* The name of the rover sent in the lander is Pragyan. Its weight is 26 kg. It rotates on the surface of the moon with the help of six wheels and works for 14 days. It has two payloads.

ల్యాండర్, రోవర్ వివరాలు

* చంద్రయాన్-3లో వెళ్లిన ల్యాండర్ పేరు విక్రమ్. దీని బరువు 1749.8 కిలోలు. జీవితకాలం.. 14 రోజులు. 2 రెండు మీటర్ల పొడవు, 2 మీ. వెడల్పుతో కూడిన ఈ ల్యాండర్ మూడు పేలోడ్లను అమర్చారు.

* ఇక ల్యాండర్లో పంపించిన రోవర్ పేరు ప్రగ్యాన్. దీని బరువు 26 కిలోలు. ఆరు చక్రాల సహాయంతో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ 14 రోజులు పనిచేస్తుంది. ఇందులో రెండు పేలోడ్లు ఉన్నాయి.


This is what payloads in Lander and Rover do.

Payloads in the lander Vikram.. RAMBA: Study of the density of ions and electrons on the surface of the Moon CHASTE: Measuring thermal properties on the Moon

ILSA: Investigates the nature of layers and soil on the Moon. Payloads in the rover.. LIBS: The laser in this

It is smelted and examined for its elements and mineral wealth. APXS: Identification of Chemicals in Soils and Rocks

ల్యాండర్, రోవర్ లోని పేలోడ్స్ చేసే పని ఇదే..

ల్యాండర్ విక్రమ్లో ఉండే పేలోడ్స్.. రాంబా: చంద్రుడి ఉపరితలంపై ఉన్నఅయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రతపై అధ్యయనం చాస్టే: చంద్రుడిపై ఉష్ణ లక్షణాలను కొలుస్తుంది

ILSA: చంద్రుడిపై పొరలు, మట్టి స్వభావాన్ని పరిశీలిస్తుంది. రోవర్లోని పేలోడ్స్.. LIBS: ఇందులోని లేజర్ మట్టిని కరిగించి అందులోని మూలకాలు, ఖనిజ సంపదపై పరిశీలిస్తుంది. APXS: మట్టి, రాళ్లలో ఉన్న రసాయనాల గుర్తింపు

Comments

Popular posts from this blog

Professional engineering

"Samudrayaan"