About isro projects

ISRO Indian Space Research Organisation. 

Our country is home to space experiments. The main function of this organization is to conduct research in this sector. ISRO plays a vital role in the development of the country through education, agriculture, communication and defense sector projects. ISRO has been achieving better results than many countries in the world despite starting the research later.

ISRO ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మన దేశం అంతరిక్ష ప్రయోగాలకు నిలయం. ఈ విభాగంలో పరిశోధనలు చేయడం ఈ సంస్థ ప్రధాన విధి. విద్య, వ్యవసాయ, కమ్యూనికేషన్, రక్షణ రంగ ప్రాజెక్టుల ద్వారా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది ఇస్రో. ప్రపంచంలో పలు దేశాలకంటే ఆలస్యంగా పరిశోధనలు ప్రారంభమైనా ఇస్రో వాటి కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తోంది.

The Indian National Committee for Space Research (INCOSPAR) was established in 1962 by the then Prime Minister of India, Jawaharlal Nehru, under the 'Department of Atomic Energy'. Later the Tumba Equitorial Rocket Launching Station was set up at Tumba near Thiruvananthapuram. It is a port used for launching rockets. Later in 1969 INCOSPAR was changed to ISRO. In 1972, the Indian Space Department was formed and ISRO was made a part of it. This department reports all its activities directly to the Prime Minister.


అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 'డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ' ఆధ్వర్యంలో 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్(INCOSPAR)ని స్థాపించారు. తర్వాత తిరువనంతపురం సమీపంలోని తుంబా వద్ద తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇది రాకెట్లను ప్రయోగించడానికి వాడే ఒక పోర్ట్. తర్వాత 1969లో INCOSPARని ISRO గా మార్చారు. 1972లో భారత అంతరిక్ష శాఖను ఏర్పాటు చేసి ISROని అందులో భాగం చేశారు. ఈ శాఖ తన కార్యకలాపాలన్నీ నేరుగా ప్రధానికి నివేదిస్తుంది.

ISRO has built three types of launch vehicles. They include PSLV (Polar Satellite Launch Vehicle), GSLV (Geosynchronous Satellite Launch Vehicle), GSLV Mark3. ISRO has successfully launched 101 space missions, 71 launch missions and 2 re-entry missions so far. 269 foreign satellites have been launched. Among them are American satellites.

ISRO milestones..

ISRO launched Aryabhatta, the first Indian satellite,on 19 April 1975, six years after its establishment.

* In 1980 ISRO launched the first launch vehicle Satellite Launch Vehicle (SLV)-3.

* In 1982, ISRO launched its first INSAT satellite. This

The name of the communication satellite is INSAT-1A. * INSAT-1B Commissioned Indian National Satellite System in 1983

Arranged. It is one of the largest domestic communications satellite systems. * In 2016, ISRO launched 104 satellites in a single rocket Created a world record.

* Apart from these, many satellites serve telecommunications, television, news gathering, social applications, weather, disaster warning, search.

ఇస్రో మూడు రకాల ప్రయోగ వాహనాలను తయారు చేసింది. వాటిలో PSLV (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్), GSLV (జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్), GSLV మార్క్3. ఇస్రో ఇప్పటివరకు 101 అంతరిక్ష ప్రయోగాలు, 71 లాంఛ్ మిషన్లు, 2 రీఎంట్రీ మిషన్లను విజయవంతంగా ప్రయోగించింది. 269 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది. వాటిలో అమెరికాకు చెందిన శాటిలైట్లు కూడా ఉన్నాయి.

ఇస్రో మైలురాళ్లు..

ఇస్రో ఏర్పాటైన ఆరేళ్ల తర్వాత 1975 ఏప్రిల్ 19న మొదటి భారతీయ శాటిలైట్ ఆర్యభట్టను ఇస్రో లాంఛ్ చేసింది.

* 1980లో మొదటి ప్రయోగ వాహనం శాటిలైట్ లాంచ్ వెహికిల్ (SLV)-3ని లాంచ్ చేసింది ఇస్రో.

* 1982లో ఇస్రో తన మొదటి ఇన్సాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ కమ్యునికేషన్ ఉపగ్రహం పేరు ఇన్సాట్-1ఏ.

* 1983లో ఇన్సాట్-1బి కమిషన్ ఇండియన్ నేషనల్ శాటిలైట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది అతిపెద్ద దేశీయ సమాచార ఉపగ్రహ వ్యవస్థల్లో ఒకటి. 

* 2016లో ఒకే రాకెట్లో 104 ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో ప్రపంచరికార్డు సృష్టించింది.

* ఇవే కాకుండా టెలీకమ్యూనికేషన్స్, టెలివిజన్, వార్తల సేకరణ, సామాజిక అనువర్తనాలు, వాతావరణ, విపత్తు హెచ్చరికలు, శోధనకు సంబంధించిన అనేక శాటిలైట్లు సేవలందిస్తున్నాయి.

Chandrayaan..

ISRO has taken up the Chandrayaan project to study the moon. Many countries are conducting experiments on the moon to find out whether there is a trace of water on the moon and whether there are suitable conditions for human life. ISRO launched Chandrayaan 1 in 2008. Through this trace of water was found on the moon. India has achieved the glory of being the fourth country to successfully land on the surface of the Moon. ISRO Chandrayaan 2 in 2019.

The experiment was carried out. However, Chandrayaan 2, which went close to the moon, experienced a technical error during landing and crash landed. However, the orbiter that was sent to Zabili as part of the Chandrayaan 2 mission is still orbiting the moon.

» Chandrayaan 3 has recently been sent to the South Pole of the Moon which no other country has done so far.



చంద్రయాన్..

చంద్రుడిపై అధ్యయనం కోసం ఇస్రో చంద్రయాన్ ప్రాజెక్టును చేపట్టింది. చంద్రుడిపై నీటి జాడ, మానవుల జీవనానికి తగిన పరిస్థితులు ఉన్నాయా అనే విషయం తెలుసుకోవడానికి చాలా దేశాలు చంద్రుడిపై ప్రయోగాలు చేస్తున్నాయి. ఇస్రో 2008లో చంద్రయాన్ 1 ప్రయోగాన్ని నిర్వహించింది. దీని ద్వారా చంద్రుడిపై నీటి జాడ కనుగొన్నారు. చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారతదేశం కీర్తిని సాధించింది.

2019 లో ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేపట్టింది. అయితే చంద్రుడి దగ్గరి వరకు వెళ్లిన చంద్రయాన్ 2.. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తి.. క్రాష్ ల్యాండింగ్ అయింది. అయితే ఆ చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా జాబిల్లిపైకి పంపించిన ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంది.

» తాజాగా ఇప్పటివరకూ ఏ దేశం చేయని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువం పైకి చంద్రయాన్ 3ని పంపారు.

Mangalyaan...

The Mars Orbiter Mission (MOM) 450 crores in 2013 ISRO successfully launched valuable Mars orbital mission. This experiment was successful in the first attempt of research on Mars. It was launched by the Indian Space Research Organization (ISRO) on November 5, 2013 by PSLV-C25 rocket. After traveling a distance of about 40 crore kilometers for 300 days, this orbiter successfully entered the orbit of Mars on September 24, 2014. India is recognized as the first country to achieve this feat in its first attempt. Mars Orbiter carries five instruments for research on Martian surface features, morphology, minerals and weather conditions. Mars Kolar Camera, Thermal Infrared Imaging Spectrometer, Methane Sensor for Mars, Mars Exospheric Neutral Composition Analyzer and Lyman Alpha Photometer are placed in it.

Originally, this orbiter was designed to operate for six months. However, it has served for almost 8 years beyond expectations. It orbited Mars and sent over 8,000 photos of the conditions there. Mars provided the Atlas.



మంగళ్యాన్...

మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM)

2013లో రూ.450 కోట్ల విలువైన మార్స్ ఆర్బిటరీ మిషన్ను విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. అంగారక గ్రహంపై పరిశోధనలకు చేసిన మొదటి ప్రయత్నంలోనే ఈ ప్రయోగం విజయవంతమైంది. 2013 నవంబరు 5న పీఎస్ఎల్వీ-సి 25 రాకెట్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రయోగించింది. దాదాపు 40 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని 300 రోజుల పాటు ప్రయాణించిన ఈ ఆర్బిటర్.. 2014 సెప్టెంబరు 24న అది విజయవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్ గుర్తింపు పొందింది. అంగారక ఉపరితల లక్షణాలు, స్వరూపం, ఖనిజాలు, వాతావరణ పరిస్థితులపై పరిశోధనలకు మార్స్ ఆర్బిటర్లో ఐదు పరికరాలను అమర్చారు. మార్స్ కోలార్ కెమెరా, థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పక్ట్రోమీటర్, మీథేన్ సెన్సాన్ ఫర్ మార్స్, మార్స్ ఎక్సోస్పిరిక్ న్యూట్రల్ కంపోజిషన్ ఎనలైజర్, లైమన్ అల్ఫా ఫొటోమీటర్ ను అందులో ఉంచారు.

వాస్తవానికి ఈ ఆర్బిటర్ను ఆరు నెలల పాటు పనిచేసేలా రూపొందించారు. అయితే, అంచనాలను మించి దాదాపు 8 ఏళ్లపాటు సేవలు అందించింది. అంగారక గ్రహం చుట్టూ తిరుగుతూ అక్కడ పరిస్థితులకు సంబంధించిన 8వేలకుపైగా ఫొటోలను పంపింది. మార్స్ అట్లాస్ను అందించింది.

Gaganyon.....

ISRO Historical Project.. Gagan Yan. ISRO aims to showcase India's human spaceflight capability to the world. This mission will go down in history towards India's ambitious goals in space exploration. So far only America, Russia, China and European countries have undertaken manned space missions. As part of this mission, it is 400 km away from Earth After spending 3 days in orbit, the astronauts will be brought back to Earth using parachutes through capsules. First there is a landing in sea waters.....

ISRO is giving training to some of the navy in Kochi in Kerala and Visakhapatnam in Andhra Pradesh to assist in the landing of astronauts.

Relay satellites will be used to track the mission. ISRO. This mission Gagan will be carried out at the end of this year or at the beginning of next year (2024).



గగన్యోన్....

ఇస్రో చరిత్రాత్మక ప్రాజెక్ట్.. గగన్ యాన్. భారతదేశం మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా ఇస్రో పెట్టుకుంది. అంతరిక్ష పరిశోధనలో భారత్ ప్రతిష్టాత్మక లక్ష్యాల దిశగా ఈ మిషన్ చరిత్రలో నిలిచిపోనుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ దేశాలు మాత్రమే మానవ సహిత అంతరిక్ష యాత్రలను చేపట్టాయి. ఈ మిషన్లో భాగంగా భూమికి 400 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో వ్యోమగాములు 3 రోజుల పాటు గడిపిన తర్వాత.. అక్కడి నుంచి పారాచూట్లను ఉపయోగించి క్యాప్యూల్స్ ద్వారా వారిని భూమికి తీసుకొస్తారు. మొదట సముద్ర జలాల్లో ల్యాండింగ్ ఉంటుంది. . వ్యోమగాముల ల్యాండింగ్కు 

* సాయం అందించడానికి కేరళలోని కొచ్చి, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న నౌకాదళంలో కొంతమందికి ఇస్రో ట్రైనింగ్ ఇస్తోంది.

ఈ మిషన్ ను ట్రాక్ చెయ్యడానికి రిలే ఉపగ్రహాలను వినియోగించనుంది. ఇస్రో. ఈ మిషన్ గగన్ యాన్ ను ఈ ఏడాది చివర్లో లేదా.. వచ్చే ఏడాది (2024) ప్రారంభంలో నిర్వహించనున్నారు.



Comments

Popular posts from this blog

Professional engineering

"Samudrayaan"